అమెరికా లొంగే వరకు యుద్ధం ఆగదు: ఇరాన్ సైన్యం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ సైన్యం తీవ్రంగా స్పందించింది. శత్రువు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇరాన్‌ మిలిటరీ ఆపరేషనల్‌ కమాండ్‌ ఖతమ్‌ అల్‌ అన్బియా ప్రకటించారు. ఇరాన్‌ను అణిచివేసి, రాతి యుగం నాటికి పంపుతానన్న ట్రంప్‌ వ్యాఖ్యలకు ప్రతిస్పందించింది. భారీ స్థాయిలో దాడులు చేస్తామని అమెరికా, ఇజ్రాయెల్‌లను ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలను దెబ్బతీశామన్న అమెరికా వాదనలను ఇరాన్‌ తోసిపుచ్చింది. అమెరికా దురాక్రమణకు దిగిందని ఆరోపిస్తూ, ప్రతీకార చర్యలు కొనసాగుతాయని విమర్శించింది.

సంబంధిత పోస్ట్