IRCTC సేవల్లో మరోసారి అంతరాయం

ప్రముఖ రైల్వే టికెట్ల ప్లాట్‌ఫారమ్‌ ఐఆర్‌సీటీసీ (IRCTC) సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. శనివారం ఉదయం 10 గంటలకు తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ ప్రారంభం కావడంతో వెంటనే వెబ్‌సైట్‌, యాప్‌ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఛట్‌ పూజ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లాలనుకున్న వేలాది మంది టికెట్లు బుక్‌ చేసుకోలేకపోయారు. డౌన్‌డెటెక్టర్‌ ప్రకారం, ఇది వారంలో రెండోసారి కావడం గమనార్హం.

సంబంధిత పోస్ట్