అయోధ్యకు IRCTC ప్రత్యేక ప్యాకేజీ.. వందే భారత్‌లో రామ్ లల్లా దర్శనం

అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం IRCTC ప్రత్యేక ‘రామ్ లల్లా దర్శన్ అయోధ్య’ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రోజుల ఈ ప్యాకేజీలో వందే భారత్ ప్రయాణం, హోటల్ బస, భోజనాలు, రామ్ లల్లా ఆలయం, సరయూ ఘాట్, హనుమాన్ గర్హి, కనక్ భవన్ దర్శనాలు ఉన్నాయి. ప్రతి శుక్ర, శనివారాల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉండగా, ధర రూ.16,170 నుంచి ప్రారంభమవుతుంది. బుకింగ్‌కు ఉపయోగించిన ఫోటో ఐడీ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్