మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ సంచలనం సృష్టించింది. మాజీ ఛాంపియన్ వెస్టిండీస్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బౌలర్ల కృషితో ప్రత్యర్థిని 128 పరుగులకే కట్టడి చేసిన ఐరిష్ టీమ్, స్వల్ప ఛేదనను అలవోకగా పూర్తి చేసింది. ఒర్లా ప్రెండెర్గాస్ట్ 63 పరుగులతో అదరగొట్టగా, అమీ హంటర్ 28 పరుగులు చేసింది. ఈ విజయంతో ఐర్లాండ్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చింది. శుక్రవారం భారత్‌పై పురుషుల జట్టు సాధించిన చారిత్రాత్మక విజయం స్ఫూర్తితో మహిళల జట్టు ఈ ఘన విజయం సాధించింది.