మహిళల్లో ఐరన్ లోపం వల్ల అలసట, బలహీనత, శ్వాస ఇబ్బంది, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు తెలిపారు. ఈ లోపాన్ని అధిగమించడానికి పాలకూర, బీట్రూట్, పప్పులు, మాంసం, గుడ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలని సూచించారు. ఐరన్ శోషణను పెంచడానికి విటమిన్-సి కలిగిన నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.