నీటిపారుదల శాఖలో ఈఈగా పని చేస్తున్న నూనె శ్రీధర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ACB దాడులు చేపట్టింది. హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. శ్రీధర్ ప్రస్తుతం ఎస్‌ఆర్‌ఎస్పీ డివిజన్-8లో ఈఈగా పనిచేస్తున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. శ్రీధర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు.