మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రం వరుసగా రెండో వారంలోనూ నిలకడగా వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రెండో శుక్రవారం రూ.11.5 కోట్లు కలెక్ట్ చేసి పుష్ప2, కల్కి, బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేసింది. ప్రస్తుతం RRR మాత్రమే రూ.14.5 కోట్లతో తొలి స్థానంలో ఉంది. మరోవైపు ఇరుముడి ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసి రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.