మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు వెల్లడించింది. ఈ విజయంతో రవితేజ కెరీర్‌లో మరో భారీ కమర్షియల్ హిట్‌గా ‘ఇరుముడి’ నిలిచినట్లు పేర్కొంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది.