మొండి దగ్గు గుండె సమస్యలకు సంకేతమా?

సీజనల్ ఫ్లూ, అలెర్జీ, గొంతు ఇన్ఫెక్షన్, న్యుమోనియా వంటి సమస్యలతో దగ్గు వస్తుందని, అయితే నిరంతర దగ్గు గుండె సమస్యలకు సంకేతం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండె కండరాలు గట్టిపడటం, గుండె వైఫల్యం, రుమాటిక్ గుండె జబ్బులు, రక్తపోటు మందుల వల్ల కూడా దీర్ఘకాలిక దగ్గు రావచ్చని తెలిపారు. దృష్టి సమస్యలు, కడుపు ఉబ్బరం, చర్మంపై దద్దుర్లు, చేతి వేళ్ల రంగు మారడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కూడా గుండె సమస్యలను సూచిస్తాయని, వేళ్లు నీలిరంగులోకి మారడం ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ కు సంకేతమని వైద్యులు తెలిపారు. దీర్ఘకాలిక దగ్గును సాధారణంగా భావించకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్