నేటి జీవనశైలిలో ఫిట్‌నెస్ పట్ల అవగాహన పెరుగుతున్నప్పటికీ, వ్యాయామం క్రమంగా వ్యసనంగా మారుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా వ్యాయామం చేయడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, తీవ్రమైన అలసట, కండరాల క్షీణత, నిద్రలేమి, చిరాకు వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనిని ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ అంటారు. వ్యాయామం జీవితంలో భాగం కావాలి కానీ జీవితం కాకూడదంటున్నారు. సామాజిక సంబంధాలు, ఉద్యోగ బాధ్యతలను పక్కన పెట్టి కేవలం వర్కవుట్స్‌కే ప్రాధాన్యత ఇవ్వడం ఆరోగ్యకరమైన పరిమితులను దాటినట్లే అంటున్నారు.