అంతరిక్షంలో ఆయుధాలను మోహరించామని అమెరికా ప్రకటించడంతో స్పేస్ వార్‌పై చర్చ మొదలైంది. అమెరికా, చైనా, రష్యా ఇప్పటికే యాంటీ శాటిలైట్ (ఏశాట్) పరీక్షలు నిర్వహించాయి. భారత్ కూడా 2019లో ‘మిషన్ శక్తి’ ద్వారా లో ఎర్త్ ఆర్బిట్‌లోని మైక్రోశాట్-ఆర్ ఉపగ్రహాన్ని కూల్చి ఏశాట్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. దీంతో అమెరికా, చైనా, రష్యా తర్వాత ఈ సత్తా చూపిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. అయితే అంతరిక్షంలో ఆయుధాలను మోహరించే ప్రయత్నాలు భారత్ చేస్తున్నట్లు ఇప్పటివరకు ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.