వేసవిలో చల్లటి నీరు తాగితే ప్రమాదమా?

వేసవిలో పెరుగుతున్న ఎండల నేపథ్యంలో చాలామంది చల్లటి నీరు తాగుతున్నారు. అయితే ఇది శరీర అంతర్గత ఉష్ణోగ్రతను తగ్గించి, జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుందని, అజీర్ణం, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం తర్వాత ఐస్ వాటర్ తాగడం వల్ల కొవ్వు పదార్థాలు గట్టిపడతాయని తెలిపారు. గోరువెచ్చని నీరు తాగడం వల్ల వ్యర్థాలు బయటకు వెళ్లి, రక్త ప్రసరణ మెరుగుపడి, జీవక్రియ పెరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుందని వివరించారు. బయటి నుంచి రాగానే వెంటనే నీరు తాగకుండా, శరీరం సాధారణ స్థితికి వచ్చాక, సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు తాగడం ఉత్తమమని, మట్టి కుండలో నీరు తాగడం మంచిదని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్