కవిత TRS పార్టీకి షాక్ తప్పదా?

TG: కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సమితి(TRS) పేరు విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. వివరణతో కూడిన సుదీర్ఘ లేఖ రాసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ అంశంపై వివిధ వ్యక్తులు, సంస్థలు, రాజకీయ వర్గాల నుంచి 600కుపైగా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందినట్లు తెలుస్తోంది. దీంతో కవిత పార్టీ పేరు కొనసాగుతుందా? లేక ఎన్నికల సంఘం మార్పులు సూచిస్తుందా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్