వాకింగ్ లో కాళ్ల నొప్పి అధిక కొలెస్ట్రాల్ కు సంకేతమా?

శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలామంది వాకింగ్ చేస్తారు. అయితే వాకింగ్ చేసేటప్పుడు కాళ్లు, తొడలు, పిరుదులలో నొప్పి రావడం, విశ్రాంతి తర్వాత కూడా తగ్గకపోవడం వంటి లక్షణాలు అధిక కొలెస్ట్రాల్ ను సూచిస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు. ధమనుల్లో కొలెస్ట్రాల్ అడ్డుపడటం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగక కాళ్లు బరువుగా అనిపించడం, మెట్లు ఎక్కడం కష్టమవడం, కాళ్లు చల్లగా ఉండటం, తిమ్మిర్లు, పాదాల రంగు మారడం వంటివి సంభవిస్తాయి. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్