థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు మఖానాను పరిమితంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మఖానా గోయిట్రోజెనిక్ ఆహారం కాదని, అయోడిన్ వినియోగం లేదా థైరాయిడ్ హార్మోన్ల తయారీపై ప్రభావం చూపదని తెలిపారు. 30 గ్రాముల మఖానాలో 110 కేలరీల కంటే తక్కువ శక్తి ఉండటంతో పాటు పీచు, మెగ్నిషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. పొడిగా వేయించి, తక్కువ ఉప్పు, నెయ్యి లేదా కొబ్బరి నూనెతో తీసుకోవడం మంచిది.