ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి సరైన ఆహారపు అలవాట్లు ముఖ్యం. డయాబెటిస్ ఉన్నవారు బొప్పాయి పండ్లను తీసుకోవచ్చా అనే దానిపై పరిశోధనలు జరిగాయి. రోమ్ జె డయాబెటిస్ న్యూట్రిషన్ మెటాబ్ డిస్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, బొప్పాయిలోని లక్షణాలు రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గిస్తాయి. పచ్చి బొప్పాయిలో సహజ చక్కెరలు తక్కువగా, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. పండిన బొప్పాయిలో ఫ్రక్టోజ్ శాతం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తినే పరిమాణాన్ని నియంత్రించుకోవాలి.