'దిశ' ఘటన ఆధారంగా ‘దాయ్‌రా’ మూవీ?

హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఆధారంగా కరీనా కపూర్, పృథ్వీరాజ్ జంటగా ‘దాయ్‌రా’ మూవీ తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై డైరెక్టర్ మేఘన స్పందించారు. ‘ఇది ఒక్క కేసుకు సంబంధించిన సినిమా కాదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తీసింది’ అని తెలిపారు. కాగా 2019 NOV 27న వెటర్నరీ డాక్టర్‌(27)పై సామూహిక హత్యాచారం చేశారు. DEC 6న సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో పోలీసులు వారిని ఎన్‌కౌంటర్లో లేపేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్