స్మార్ట్ రేషన్ కార్డులో పేరు తప్పుగా వచ్చిందా.. మీ ఫోన్‌లోనే ఇలా మార్చేయండి!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తోంది. అయితే కొందరి కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు, ఇతర వివరాల్లో తప్పులు వచ్చినట్లు తెలుస్తోంది. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ వివరాలను మొబైల్‌ ద్వారా సరిచేసుకోవచ్చు. ఫోన్లలో T-Ration యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. యాప్‌లో స్మార్ట్ కార్డును స్కాన్ చేసిన తర్వాత డిజిటల్ వెరిఫికేషన్ ప్రాసెస్ కనిపిస్తుంది. అక్కడ తప్పుగా ఉన్న సమాచారం చెక్ చేసి, ఎడిట్ ఆప్షన్ ద్వారా వివరాలను సరిచేసి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డును PDF రూపంలో ఫోన్‌లో సేవ్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕