నటి రష్మిక మందన్న, నటుడు విజయ్ దేవరకొండ రేపు వివాహం చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఈ వార్తలకు సంబంధించి ఇద్దరు యువతులు విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గత ఏడాది చివర్లో వీరిద్దరూ సన్నిహితుల సమక్షంలోనే నిశ్చితార్థం చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రష్మిక స్పందిస్తూ, సరైన సమయంలో స్పందిస్తానని గతంలో తెలిపారు.