కూరలో ఉప్పు ఎక్కువైందా?

కూరలో ఉప్పు తక్కువైతే మళ్లీ వేసుకోవచ్చు.. కానీ ఎక్కువ అయితే? దీనికీ పరిష్కారాలు ఉన్నాయి. గోధుమ పిండిలో కాస్త నీళ్లు పోసి ఉండలుగా చేసుకోవాలి. వాటిని కూరలో వేసి ఉడికిస్తే కర్రీలోని ఉప్పును గ్రహిస్తాయి. ఉల్లిపాయ, టమాటాలను పేస్టులా చేసుకుని కూరలో వేస్తే ఉప్పు తగ్గడంతో పాటు రుచి కూడా పెరుగుతుంది. పెరుగులో నీళ్లు వేసి మిక్స్ చేసి కూరలో కలిపిస్తే సరి. కర్రీలో కొబ్బరిపాలు పోసినా ఉప్పు తగ్గుతుంది. మీరూ ప్రయత్నించేయండి మరీ!

సంబంధిత పోస్ట్