BRSలో చేరికలు లేకపోవడానికి కారణం ఇదేనా?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయినా, ప్రధాన ప్రతిపక్షమైన BRSలో ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అధికార పార్టీపై వ్యతిరేకత పెరిగే కొద్దీ ప్రతిపక్షాల్లోకి నాయకుల చేరికలు పెరుగుతాయి. అయితే BRSలో అలాంటి పరిస్థితి కనిపించకపోవడానికి పార్టీ అంతర్గత వ్యవహారాలే కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జిల్లాల వారీగా కొందరు నేతల ఆధిపత్యం, కొత్త నాయకులకు తగిన ప్రాధాన్యం లభించదన్న భావన, టికెట్ హామీలపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలు చేరికలకు అడ్డంకిగా మారుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు నేతలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్