రేపు విజయ్‌ ప్రమాణ స్వీకారం అనుమానమే?

టీవీకే ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. గురువారం జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని గవర్నర్‌కు విజయ్ ఒప్పించలేకపోయారని సమాచారం. విజయ్‌కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి అని గవర్నర్ స్పష్టం చేశారు. మరోవైపు, వామపక్షాలు విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించాయి.

సంబంధిత పోస్ట్