నేపాల్ - టిబెట్ సరిహద్దుల్లోని గరాంగ్ ప్రాంతంలో సంభవించిన భారీ వరదల్లో కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఈషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది సభ్యులు గల్లంతయ్యారు. బుధవారం నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల బీభత్సంలో నేపాలీలతో సహా దాదాపు 600 మంది గల్లంతయ్యారు. ఈషా ఫౌండేషన్ టీంలోని 495 మంది సురక్షితంగా తిరిగి వచ్చినట్లు సద్గురు తెలిపారు. మిగిలిన వారికోసం భారత ప్రధాని మోదీ నేపాల్ ప్రధానితో మాట్లాడి, అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.