బ్యాంక్ ఉద్యోగిగా ఇషాన్ కిషన్‌.. నెట్టింట వైరల్!

భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పాట్నాలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్రాంచ్‌లో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. 2017లోనే స్పోర్ట్స్ కోటా కింద RBIలో అసిస్టెంట్ మేనేజర్‌గా నియమితులైన ఇషాన్, తన బిజీ క్రికెట్ షెడ్యూల్ మధ్యలోనూ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఆర్బీఐ తరఫున పలు దేశవాళీ టోర్నమెంట్లలోనూ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇషాన్, నెలకు సుమారు రూ.90 వేల వరకు వేతనం పొందుతున్నాడు. అతని ఉద్యోగ బాధ్యతలను నెరవేరుస్తున్న తీరును నెటిజన్లు అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్