మలేషియా కొత్త రాజుగా ఇబ్రహిం ఇస్కందర్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. కౌలాలంపూర్‌లోని నేషనల్ ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించిన పట్టాభిషేక మహోత్సవంలో ఇస్కందర్ ప్రమాణస్వీకారం చేశారు. నాలుగు నెలల క్రితమే ఆయనను మలేషియా రాజుగా ప్రకటించిన విషయం తెలిసిందే.