లెబనాన్‌లోని కోటను స్వాధీనం చేసుకొన్న ఇజ్రాయెల్‌ (VIDEO)

దక్షిణ లెబనాన్‌లోని చారిత్రాత్మక, వ్యూహాత్మక ప్రాధాన్యమున్న బ్యూఫోర్ట్‌ క్యాజిల్‌ కోటను ఇజ్రాయెల్‌కు చెందిన గోలానీ బ్రిగేడ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కోటపై ఇజ్రాయెల్ జెండాలను ఎగురవేశాయి. 1982 తొలి లెబనాన్ యుద్ధ సమయంలోనూ ఇదే బ్రిగేడ్ ఈ కోటను ఆక్రమించి, 2000 వరకు తమ ఆధీనంలో ఉంచింది. ఇటీవల ఇజ్రాయెల్‌పై జరిగిన దాడుల అనంతరం మళ్లీ ఈ కోటను స్వాధీనం చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణ లెబనాన్, ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతాలపై నిఘా పెట్టేందుకు ఇది కీలక స్థావరంగా భావిస్తున్నారు. యుద్ధ విమానాల సహాయంతో భూతల దాడులు నిర్వహించి కోటను చేజిక్కించుకున్నట్లు ఇజ్రాయెల్ వర్గాలు వెల్లడించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్