ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరిగినా, ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, శుక్రవారం లెబనాన్‌లోని హెజ్‌బొల్లా భూగర్భ స్థావరాలపై ఇజ్రాయెల్ బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. ఆయుధ కేంద్రాలు లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. ఒకరు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.