సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని హమాస్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ గాజాపై ఇజ్రాయెల్ తాజాగా విరుచుకుపడింది. వైమానిక దాడులు ప్రారంభించింది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఇటీవల సంధి కుదిరిన సంగతి తెలిసిందే. అయితే రఫాలో తమ సైనికులపై హమాస్ టెర్రరిస్టు కాల్పులు జరిపాడని, అందుకే టెర్రర్ టార్గెట్లపై ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకటించింది. ఈ దాడుల్లో 11 మంది పాలస్తీనియన్లు చనిపోయారు.