ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు కనీసం 1145 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 131 నగరాలు దాడులకు గురయ్యాయని ఆ సంస్థ తెలిపింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌లో కీలక సైనిక, వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు జరుపుతుండగా, ఇరాన్ కూడా ప్రతీకారంగా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది.