అణు ఒప్పందంపై అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు పాల్పడింది. టెహ్రాన్ అంతటా పేలుళ్లు వినిపించాయి, భారీగా పొగ వ్యాపించింది. అమెరికా సాయంతోనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్‌లు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇరాన్‌లో మొబైల్ ఫోన్ సేవలు నిలిచిపోయాయి.