గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు జరిపింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడుల్లో 22 మంది మృతి చెందినట్లు గాజా డిఫెన్స్ ఏజెన్సీ ప్రకటించింది. గాజాలో 12 మంది, ఖాన్ యూనిస్ ప్రాంతంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని హమాస్ తెలిపింది. అయితే హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించడంతోనే ఈ స్ట్రైక్స్ చేసినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ స్పష్టం చేసింది.