గాజాపై ఇజ్రాయెల్ దాడి (వీడియో)

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఉధృతం చేసింది. హమాస్ స్థావరాలుగా ఉన్న నాలుగు భారీ భూగర్భ సొరంగాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. సుమారు 800 మీటర్ల పొడవున్న ఈ టన్నెల్స్‌ను మిలిటెంట్లు ఆయుధాలు, పేలుడు పదార్థాల నిల్వకు వినియోగిస్తున్నట్లు తెలిపింది. లెబనాన్‌తో పాటు గాజాలోనూ హమాస్ నెట్‌వర్క్‌ను దెబ్బతీసే లక్ష్యంతో ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సైన్యం విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్