లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 254 మంది మృతి (VIDEO)

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులతో విధ్వంసం సృష్టించింది. బుధవారం జరిపిన ఎయిర్‌స్ట్రైక్స్‌లో 254 మంది మృతి చెందగా, 1,100 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని బీరుట్, బెక్కా వ్యాలీ, దక్షిణ లెబనాన్‌లో 10 నిమిషాల్లోనే 100కు పైగా లక్ష్యాలపై దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ రద్దీ ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుందని లెబనాన్ ఆరోపించింది. 1982 తర్వాత ఇదే అతిపెద్ద దాడిగా అక్కడి అధికారులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్