గాజాలో పిల్లలపై దాడులు.. సంచలనం సృష్టిస్తున్న ఐరాస నివేదిక

గాజాలో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) నియమించిన స్వతంత్ర అంతర్జాతీయ దర్యాప్తు కమిషన్ నివేదిక సంచలనం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనా పిల్లలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని, అక్కడ మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, నరమేధం జరుగుతున్నాయని కమిషన్ ఆరోపించింది. ఈ కమిషన్‌కు భారతదేశానికి చెందిన మాజీ న్యాయమూర్తి, జస్టిస్ శ్రీనివాసన్ మురళీధర్ నాయకత్వం వహిస్తున్నారు. కాల్పుల విరమణ తర్వాత కూడా చిన్నారులను ఉద్దేశపూర్వకంగానే చంపివేసినట్లు ఆధారాలు లభించాయని జస్టిస్ మురళీధర్ తెలిపారు. అయితే, ఈ నివేదికను ఇజ్రాయెల్ పక్షపాతంతో కూడిన 'ప్రచార పత్రం'గా కొట్టిపారేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్