ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 31 మంది మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌లో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన అత్యంత భీకర దాడులు ఇవే. ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు పలు గ్రామాలు, నివాస ప్రాంతాలు, హెజ్‌బొల్లా స్థావరాలపై దాడులు చేశాయి. మహిళలు, పిల్లలు సహా పలువురు పౌరులు మృతి చెందారు.