ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ క్యాన్సర్ సోకింది. 2024 డిసెంబర్లో ప్రోస్టేట్ సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న ఆయనకు తరువాత నిర్వహించిన పరీక్షల్లో అత్యంత ప్రారంభ దశ క్యాన్సర్ గుర్తించినట్లు సమాచారం. అయితే వ్యాధి ఇతర భాగాలకు వ్యాపించలేదని వైద్యులు నిర్ధారించారు. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధ సమయంలో తన ఆరోగ్య పరిస్థితి శత్రువులకు ప్రచార ఆయుధంగా మారకూడదనే ఉద్దేశంతో ఈ సమాచారం రెండు నెలలు ఆలస్యంగా విడుదల చేసినట్లు నెతన్యాహూ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని, మంచి శారీరక స్థితిలో ఉన్నారని ప్రధాని కార్యాలయం పేర్కొంది.