హైదరాబాద్‌లోని ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ISRO NRSC) వివిధ విభాగాల్లో 13 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 30, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌లో కనీసం 75% మార్కులతో ఉత్తీర్ణత, సంబంధిత పని అనుభవం అవసరం. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.