త్వరలో గగన్‌యాన్‌ D1 ప్రయోగం చేపట్టనున్న ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకమైన గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా త్వరలో D1 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2 పీఎస్‌ఎల్‌వీ, ఒక గగన్‌యాన్, ఒక ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగాలను నిర్వహించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో రాకెట్ ప్రయోగాలకు ప్రైవేట్ భాగస్వామ్యానికి పెద్దపీట వేయనున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ తెలిపారు. మానవసహిత అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో అన్ని విధాలా సన్నద్ధమవుతోందన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕