సంక్షేమ పథకాల ఆద్యుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మనకి దూరమై నేటికి 16 ఏళ్లు అవుతోంది. 2009 సెప్టెంబర్ 2న దురదృష్టవశాత్తు ఆయన నల్లమల అడవుల్లో హెలీకాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. 2003లో మండువేసవిలో పాదయాత్ర చేసి 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆరోగ్య శ్రీ, రైతులకు ఉచిత విద్యుత్తు, అభయహస్తం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారు. 2009లో రెండోసారి సీఎం పదవి చేపట్టిన వైఎస్ఆర్ అదే ఏడాది మరణించారు.