ఖరీఫ్‌లో రైతులు పెసర పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. తొలకరి వర్షాలు పడిన వెంటనే చౌడు లేని భూముల్లో పెసర పంట సాగుచేసుకోవచ్చని వ్యవసాయ నిపుణులు తెలిపారు. తెగుళ్ల బెడద ఎక్కువగా ఉండడంతో సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలంటున్నారు. ఎల్‌జీజీ 407, 450, 460, టీఎం 92 పెసర రకాలు ఖరీఫ్‌కు అనుకూలం. ఎకరాకు 10-12 కిలోల విత్తనాలు చల్లుకోవాలి. 25వ రోజుకు 10-15 కిలోల యూరియా వేయాలి. 60-70 రోజుల్లో కోతకు వస్తుందని నిపుణులు తెలిపారు.