జీవన్‌రెడ్డి సీఎంపై విమర్శలు చేయడం సరికాదు: మహేశ్‌కుమార్‌గౌడ్

TG: కాంగ్రెస్ పార్టీ వీడిన సీనియర్ నేత జీవన్ రెడ్డి సీఎం రేవంత్‌‌పై విమర్శలు చేయడం సరికాదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్ అన్నారు. గురువారం గాంధీభవన్​లో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి సీఎం రేవంత్‌ అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ వేర్వేరు కాదని, భవిష్యత్తులో 2 పార్టీలు కలిసి పోతాయని జోస్యం చెప్పారు. పొంగులేటిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమన్నారు. హరీశ్‌రావు వద్ద ఆధారాలు ఉంటే తీసుకురావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్