బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మేనేజర్, ఆఫీసర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన బీఓబీలో కెరీర్ నిర్మించుకోవడానికి ఐటీ నిపుణులకు ఇది ఒక గొప్ప అవకాశం. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఫిబ్రవరి 19. మొత్తం 418 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్, ఐటీ, లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్‌లో బీఈ బి.టెక్. ఎం.టెక్. ఎంఈ ఎంసీఏ పూర్తిచేసి ఉండాలి. ఐటీ విభాగంలో కనీసం ఏడాది నుంచి ఐదేండ్ల అనుభవం ఉండాలి. వయోపరిమితి 22 నుంచి 37 ఏండ్లు. అప్లికేషన్ ఆన్‌లైన్ ద్వారా జనవరి 30 నుంచి ప్రారంభమైంది. వేతనం నెలకు రూ. 48 వేల నుంచి లక్షా 5 వేల వరకు ఉంటుంది.