హైదరాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు మరోసారి దాడులు నిర్వహించారు. వుడ్ బ్రిడ్జి హోటల్ యజమాని హర్షద్ అలీ ఖాన్ ఇంట్లో సోదాలు జరిపి, ఆయన్ను విచారిస్తున్నారు. గతంలో ఐటీ దాడులు జరిగిన షాగౌస్, పిస్తాహౌస్, మెహఫిల్ రెస్టారెంట్ల యజమానులతో వుడ్ బ్రిడ్జి హోటల్ యజమానికి ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాల్లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.