TG: వరంగల్ రైతు డిక్లరేషన్ సమయంలో కేంద్రం చెప్పిందే కొంటామని ఎందుకు చెప్పలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రైతులు పండించిన పంటంతా కొనుగోలు చేశారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రం చెప్పిందే కొంటామని చెప్పడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. రైతులు రోడ్లపైకి రాకముందే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.