అక్టోబర్‌లోనూ ఎండలే.. చలికాలం ఆలస్యం!

TG: రాష్ట్రంలో వర్షాకాలం ముగిసింది, నైరుతి రుతుపవనాలు కూడా వెళ్లిపోయాయి. ఎల్​నినో ప్రభావంతో ఈసారి పెద్ద వర్షాలు పడలేదు. ఈ క్రమంలోనే అక్టోబర్ నెలలో ఎండలు తీవ్రంగా ఉంటాయని, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. నవంబర్​లోనే పీక్ చలికాలం మొదలవుతుందని, అప్పటివరకు ఉక్కపోత తీవ్రంగా ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా అకాల వర్షాలు కూడా పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕