జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ త్వరలో తండ్రి కాబోతున్నట్లు అతని భార్య కడెం వంశిత సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌ను ప్రవీణ్‌కి చూపించిన వీడియోను ఆమె ఇన్ స్టాలో పంచుకుంది. ఈ ఏడాది మేలో వీరి వివాహం జరిగింది. ప్రవీణ్ ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోలలో నటిస్తుండగా, వంశిత నటిగా, డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ శుభవార్తతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.