టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సృష్టించాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో జడేజా రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు బాదడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 72 రన్స్, రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేశాడు. అంతకు ముందు 1952లో వినూ మన్కడ్ ఇదే రికార్డు నెలకొల్పాడు. 73 ఏళ్ల తర్వాత ఈ ఘనత జడేజా ఖాతాలో పడింది.