లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 9 పరుగులకే ఔట్ అయ్యాడు. 39.3 ఓవర్‌లో జోష్ టంగ్ బౌలింగ్‌లో జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి జడేజా వెనుదిరిగాడు. దీంతో 40 ఓవర్లకు భారత్ స్కోర్ 123/5గా ఉంది. క్రీజులో కరుణ్ నాయర్ (12), ధ్రువ్ జురేల్ (0) ఉన్నారు.
Credits: ECB