జడేజా ఒంటరి పోరాటం..150 బంతుల్లో హాఫ్ సెంచరీ

అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ సాధించారు. రవీంద్ర జడేజా 150 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. స్టోక్స్ వేసిన 67.1 ఓవర్‌కు ఫోర్ బాది జడేజా అర్ధ శతకాన్ని అందుకున్నారు. దీంతో 68 ఓవర్లకు భారత్ స్కోరు 159/9గా ఉంది. సిరాజ్ (0), జడేజా (54) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 34 పరుగులు అవసరం.

Credits: JioHotstar

సంబంధిత పోస్ట్