రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రంలో నటుడు జగపతిబాబు అప్పలసూరి పాత్రలో ఒదిగిపోయి డబ్బింగ్ చెబుతున్నారు. కథను మలుపుతిప్పే ఈ పాత్రపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా ఆయన డబ్బింగ్ చెప్పే వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో విడుదల కానుంది.